రెంజల్,ఏప్రిల్ 27,ప్రభన్యూస్: జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 20వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు.సిబ్బంది ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరును ఆయన పర్యవేక్షించారు.కొద్దిసేపు రైతులతో ముచ్చటించి సలహాలు,సూచనలు చేశారు. రెండు కిలోల తరుగు తీస్తున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రైతులు అవసరమైనంత వరకు ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి మద్దతు ధర పొందాలని సూచించారు. జిల్లాలో 325 కేంద్రాలను ప్రారంభించి లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో మొత్తం 450 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిసి ఉండగా మిగిలిన సెంటర్లను త్వరలో ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. క్రమంగా రైతుల డబ్బులను ఖాతాల్లో వేయడం ప్రారంభించామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు ఎప్పటికప్పుడు తమ ధాన్యాన్ని ఆరబెట్టి సెంటర్లకు తరలించాలని సూచించారు. వర్షబావ పరిస్థితులను ఎప్పటికప్పుడు రైతులకు వివరించాల్సిందిగా సెంటర్ ఇన్చార్జిలను సూచించినట్లు చెప్పారు.కొనుగోలు చేస్తున్న సిబ్బందికి రైతాంగం సహకరించాలని చెప్పారు.మండలంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం కేంద్రాలను పరిశీలించి పరిస్థితులను తెలుసుకోవాలని ఇన్చార్జి తహసిల్దారును అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు.ఆయన వెంట ఇన్చార్జి తహసిల్దార్ శశిభూషణ్,ఐకేపీ ఏపీఎం చిన్నయ్య,సెంటర్ ఇంచార్జ్ తస్లీమ్,సిసి భాస్కర్,రైతులు నారాయణరెడ్డి,శేఖర్,చెట్టు కింది భూమన్న,తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement