బసవేశ్వరుని ఆశయాలు మనందరికీ ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బసవేశ్వర జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కరని, ప్రజలంతా విశ్వగురువు అని పిలుస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ వర్ణ బేధం లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించారని అన్నారు. 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువు లో ఉద్యోగం చేరి, సామర్థ్యం నిజాయితీతో ప్రధాన మంత్రి పదవి అందుకున్నారని తెలిపారు. రాజ్య పాలనను ముఖ్య పాత్ర పోషిస్తూ వచ్చిన సాహిత్యంలో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేశారని తెలిపారు. అలాంటి మహనీయుని జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, మహనీయుని బోధనలు ప్రజలంతా పాటించాలని మంచి మార్గంలో నడవాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో డి.సి.పి. రవీందర్, డి.ఆర్.డి. ఓ.శ్రీధర్, కలెక్టరేట్ సూపరెండెంట్ తూము రవీందర్, కలెక్టరేట్ సిబ్బంది,సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement