Wednesday, November 20, 2024

ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన‌ అడిషనల్ కలెక్టర్…

రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం రేపుతోంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా ఓఆర్ ఆర్ పరిధిలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతోనే జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది.

ముత్యంరెడ్డి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్ సైట్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి అందుకోసం ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో సదరు ముత్యంరెడ్డి ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. ముత్యంరెడ్డి నుంచి మధుమోహన్ రెడ్డి కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్. దాంతో తమ ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయాలంటూ ఏసీబీ అధికారులు ఆదేశించడంతో.. మధు అలాగే చేశాడు. ఏసీబీ అధికారులు ముందే జాయింట్ కలెక్టర్ కు మధుమోహన్ ఫోన్ చేయడంతో.. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్ లో చెప్పాడు. పెద్ద అంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సోమవారం రాత్రి నుంచే అంబర్ పేట మున్సిపాలిటీ తట్టి అన్నారం ఇందు అరణ్య 156 జిల్లాలోని భూపాల్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా విచారణ సాగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement