Tuesday, November 26, 2024

ఉమ్మ‌డి అదిలాబాద్ – ఓటు హక్కును వినియోగించుకున్న అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు..

నస్పూర్ నవంబర్ 30( ప్రభ న్యూస్) మంచిర్యాల జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 7 గంటల నుండే ఎన్నికలు ప్రారంభం కాగా, ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లు సకాలంలో పోలింగ్ కేంద్రానికి వచ్చి నిర్ణీత సమయంలోపు ఓటు వేయాలని కోరారు.

మోరాయించిన ఈవీెఎంలు …మళ్ళీ యధా తధంగా పోలింగ్

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల పోలింగ్ స్టేషన్ 32 లో ఈ వి ఎం మిషన్ 5 నిమిషాల పాటు మోరాయించింది దింతో ఓటర్లు కాస్త ఇబ్బందులకు గురయ్యారు వెంటనే అధికారులు అప్రమత్తమైన సెట్ చేయగా పోలింగ్ మళ్ళీ యధావిధిగా న డుస్తోంది…

ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య..

కుటుంబ సమేతంగా జెండా వెంకటపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ది దుర్గం చిన్నయ్య..

- Advertisement -

బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి అమురాజుల శ్రీదేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కోరారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు వేశారు

మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే నియోజకవర్గంలోని 289 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఉదయాన్నే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని పోలింగ్ కేంద్రాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ బీహెచ్ వి హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్మల్ కాన్వెంట్ స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోగా, అదే పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావు తన తల్లితో కలిసి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఓటు హక్కును వినియోగించుకున్న బీజీపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ రావు

నిర్మల్ జిల్లాలో జిల్లాలో 11 గంటల వరకు 25.10 శాతం పోలింగ్ నమోదు

భారీగా పోలింగ్ ఉదయం11 గంటల వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 25.10 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిర్మల్ లో 22%, ఖానాపూర్ లో 27.40%, ముధోల్ లో 26.20% పోలింగ్ శాతం నమోదయింది. ఉదయం కొద్దిపాటిగా మందకొడిగా ఉన్న ఆ తర్వాత పోలింగ్ పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

వరిపేట గ్రామస్తుల బహిష్కరణ

కాసిపేట, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వరిపేట గ్రామస్తులు ఓటు వేయడాన్ని బహిష్కరించారు. కొత్త వరిపేట, వరిపేట గ్రామాన్ని గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ బహిష్కరించారు. విషయం తెలిసి అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్, తహశీల్దార్ బోజన్న , గ్రామస్థులతో మాట్లాడి, నచ్చచెప్పడం జరిగింది. అయితే ఓటింగ్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్

ఆదిలాబాద్ జిల్లా: స్థానిక డైట్ గ్రౌండ్ లోని 261 పోలింగ్ కేంద్రంలో సతీమణి శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్,

ఓటు హక్కును వినియోగించుకున్న పోటీ అభ్యర్థులు…

నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకాలో అసెంబ్లీ ఎన్నికల పోటీబరిలో ఉన్న పలు పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. బైoసా పట్టణంలోని పులేనగర్ సుభద్రవాటిక శిశుమందిర్ పాఠశాలలో బిజెపి అభ్యర్థి పవర్ రామారావు పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకోగా, కాలోనిఆశ్రమ పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ , దేగంగ్రామంలో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విట్టల్ రెడ్డి, రువ్వి గ్రామంలో బీఎస్పీ అభ్యర్థి సర్దార్ వినోద్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది కీలకం ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

నిర్మల్ జిల్లాలో 41.74 శాతం పోలింగ్ నమోదు

నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 30 ప్రభ న్యూస్) : భారీగా పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 41.74. శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిర్మల్ లో 38.28%, ఖానాపూర్ లో 43.5%, ముధోల్ లో 43.7% పోలింగ్ శాతం నమోదయింది. ఉదయం కొద్దిపాటిగా మందకొడిగా ఉన్న ఆ తర్వాత పోలింగ్ పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

సిర్పూర్ నియోజకవర్గం లో .1-00 గంటల వరకు 36.20% శాతం ఓట్లు పోల్

సామాన్యుడిలా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పాలనాధికారి

అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో భాగంగా గురువారం రోజున జరిగిన పోలింగ్ ప్రక్రియలో జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల 198 పోలింగ్ కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా పాలనాధికారి బొర్కడే హేమంత్ సహదేవరావు సతీమణి రేవతి తో కలిసి సామాన్యుడిలా వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement