Monday, January 6, 2025

ADB – అటవీశాఖ సిబ్బంది పై గ్రామస్థుల దాడి – ఫారెస్ట్ అధికారికి గాయాలు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : కేశవపట్నం గ్రామంలో ఆదివారం ఉదయం కార్బన్ సెర్చ్ నిర్వహించిన అటవీ శాఖ అధికారులపై కేశవపట్నం గ్రామానికి చెందిన ముళ్తానీలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. .

ఈ దాడిలో ఫారెస్ట్ శిక్షణ అధికారి జాదవ్ తో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీశాఖ కు చెందిన వాహనాని ధ్వంసం చేశారు. అటవీ శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున పలువురు ఇండ్లలో సోదాలు నిర్వహించి టేకు దుంగలు మరియు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా, గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అటవీ అధికారులపై ఎదురు దాడి దిగినట్లు సమాచారం.

ఈ దాడిలో పలువురు శాఖ అధికారులకు గాయాలు కాగా అటవీశాఖకు చెందిన వాహనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement