ఉట్నూర్ ఏప్రిల్ 30 (ప్రభ న్యూస్) ఆదిలాబాద్ జిల్లాఉట్నూర్ మండలంలోని బీర్సాయి పేట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులకు భారీ వృక్షం ప్రధాన రహదారిపై నెలకోరిగాయి. దీంతో వాహనాల రాక పోకలు గంటల తరబడి స్తంభించిపోయాయి.
- Advertisement -
స్తంభించిన వాహనాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జు పటేల్ జన్నారాం మండల కేంద్రంలో ప్రచారం ముగించుకొని ఉట్నూర్ కు తిరుగు పయనమైన ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్సాయి పేట గ్రామం వద్ద చేరుకోగా భారీగా వాహన రాకపోకలు నిలిచిపోవడం గమనించి వెంటనే నెలకొరిగిన భారీ వృక్షం వద్ద చేరుకొని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి బుల్ డోజర్ సహాయంతో వృక్షమును దగ్గరుండి తొలిగించడానికి కృషి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే చేసిన పనికి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. .