ఉట్నూర్ (ఆంధ్రప్రభ) అటవీ శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అటవీశాఖ చెక్పోస్టుల్లో రాత్రి 9 తర్వాత వాహనాల రాకపోకల నిలిపివేయడంతో కార్లలో ప్రయాణించే వాహనదారులు శనివారం అర్ధరాత్రి ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్ ఉట్నూర్ తన నివాసం నుండి స్వయంగా కారు నడుపుకుంటూ కొత్తగూడెం చెక్ పోస్ట్ కు వెళ్లి ప్రయాణికుల ఇబ్బందులను పరిశీలించారు.
అటవీ శాఖ అధికారులతో మాట్లాడగా అధికారుల ఉత్తర్వులను చూపించడంతో దాని పరిశీలించారు.గతంలో ఎన్నడు లేని విధంగా రాత్రి తొమ్మిది గంటల తరువాత కవ్వాల్ అభయ్యారణ్యం గుండా చిన్న వాహనాలు వెళ్ళకూడదని అటవీ అధికారులు కొత్త నిభందనలు తీసుకోరావడం తో శ ఉట్నూర్ కొత్త గూడ చెక్ పోస్ట్ వద్ద భారీగా కార్లు, ఇతర చిన్న వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు.
దీంతో ఎముకలు కొరికే చలిలో కార్లలో ప్రయాణిస్తున్న స్త్రీలు వృద్దులు పడరాని పాట్లు పడ్డారు.చెక్ పోస్ట్ వద్ద భారీగా చిన్న వాహనాలు నిలిచిపోయాని తెలుసుకొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు ప్రయాణికులతో మాట్లాడారు. చలిలో వారు పడుతున్న బాధలు చూసి చలించి పోయారు.చెక్ పోస్ట్ సిబ్బందిని నిలదీశారు.. ఉన్నతధికారుల ఆదేశాల మేరకే తాము వాహనాలు నిలిపి వేసామని చెప్పడం తో ఎమ్మెల్యే నిర్మల్ ఎఫ్డిపిటి శాంతారాం తో ఫోన్ మాట్లాడారు. కొత్త నిభందనలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యుడని కూడ ఉన్న విషయం గుర్తు చేసారు. తనకు తెలియకుండా కొత్త నిభందనలు ఎలా అమలు పరుస్తారని నిలదీశారు వెంటనే వాహనాలు విడిచి పెట్టాలని కొరారు. ఆదిలాబాద్ డిఎఫ్ఓతో కూడ ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందికి గురి చేసే చర్యలు మానుకోవాలని సూచించారు.
చిన్న వాహనాల అనుమతి విషయంలో తాను అటవీ శాఖ మంత్రితో, ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ తో ఉదయమే మాట్లాడుతానని, ఈ అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఉన్నతా స్థాయి నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు.
అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకోరావడంతో అధికారుల ఆదేశం మేరకు బిర్సాయిపేట రేంజ్ అధికారి అరుణ,చెక్ సిబ్బంది వాహనాలను విడిచిపెట్టారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. అర్ధ రాత్రి చలిలో తమ కోసం వచ్చి తమకు సహాయం చేసిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.