తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయ్యింది నటి హేమ. రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ టీంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి పార్టీ హేమ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు. రేవ్ పార్టీని నిర్వహించడంతోపాటు.. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బుధవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు. కానీ ప్రతిసారి వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్లలేదు నటి హేమ. దీంతో ఆమె తీరుపై విసుగు చెందిన పోలీసులు ఈరోజు హైదరాబాద్ చెరుకుని నటి హేమకు మరోసారి నోటీసులు పంపించగా.. ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చింది. అయితే విచారణలో పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని.. అలాగే పార్టీ ప్లాన్ చేయడం.. నిర్వహించడంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు వెల్లడింది.