Wednesday, January 29, 2025

CM Revanth: అన‌ర్హుల‌కు ప‌థ‌కాలు అందితే.. అధికారుల‌పై చ‌ర్య‌లు

అధికారుల‌కు దిశ‌నిర్ధేశం చేసిన రేవంత్ రెడ్డి
కొత్త రేష‌న్ కార్డులు, రైతు భ‌రోసా
ఇందిర‌మ్మ ఇళ్లు, ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాలు
భ‌ట్టితో క‌ల‌సి మంత్రుత‌లో సిఎం స‌మీక్ష‌
మండ‌లంలోని ఒక్కో గ్రామంలో ప‌థ‌కాలు ప్రారంభం
మార్చి చివ‌రి తేది వ‌ర‌కు కొన‌సాగింపు
అన‌ర్హుల‌కు ప‌థ‌కాలు అందితే అధికారుల‌పై చ‌ర్య‌లు
తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు కొత్త పథకాలు అమల్లోకి చేయ‌నున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా , ఇందిరమ్మ ఇండ్లు , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఎంపిక చేసిన ల‌బ్దిదారుల‌కు అంద‌జేసే ప్ర‌క్రియ‌ను ప్రారంబిస్తునట్లు వెల్ల‌డించారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేడెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ నాలుగు ప‌థ‌కాలు అమ‌లుపై నేడు నిర్వహించిన స‌మీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఈ సమీక్షలో ప్రభుత్వం ప్రారంభించబోతున్న ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలపై సీఎం అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో ఒక్కో గ్రామాన్ని నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దని సూచించారు., అనర్హులైన వారికి లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధిందిన లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ దరఖాస్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కూడా చ‌ర్చించారు.. ముందుగా ఒక గ్రామంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి అర్హులైన వారికి అంద‌జేయాల‌ని అధికారుల‌కు సూచించారు..ఈ ప్ర‌క్రియ‌ను మార్చి 31 వ తేది వ‌ర‌కు కొన‌సాగించాల‌ని అధికార యంత్రాంగాన్ని రేవంత్ ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement