Monday, January 6, 2025

NZB | అక్రమార్కులపై చర్యలేవి ?

  • అనుమతి లేని అక్రమ కట్టడాల పై, కబ్జాదారులను వదిలేసి…
  • చిన్న ఘటనపై బల్దియా శ్రద్ధ చూపడంలో అంతర్యమేమి?
  • నాందేవాడలో ప్రహరీ గోడ కూల్చివేత పై విమర్శలు..


నిజామాబాద్ ప్రతినిధి, జనవరి4 (ఆంధ్రప్రభ): నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మించడం, అనుమతి లేని అక్రమ కట్టడాలు, కబ్జాదారులపై చర్యలు తీసుకొని బల్దియా చిన్న ఘటనపై టౌన్ ప్లానింగ్ శాఖ దృష్టి సారించడంపై విమర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. నిజామాబాద్ నగరంలో మొత్తం 60డివిజన్ల పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కార్పొరేషన్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరం. నగరంలోని నాందేడ్ వాడాలో ఆలయ ప్రహరీ గోడను కూల్చి వేయడానికి పోలీస్ బందోబస్తుతో వెళ్లడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఘటనపై టౌన్ ప్లానింగ్ శాఖ స్పందించి గోడను కూల్చివేయడం ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.

టౌన్ ప్లానింగ్ శాఖ అధికారుల అత్యుత్సాహం…
నిజామాబాద్ నగరంలో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించి చాలా సమస్యలున్నాయి. రోడ్డు కబ్జాను మొదలుకొని, అక్రమ కట్టడాలు, ఇలా చాలా వ్యవహారాలపై స్పందించని టౌన్ ప్లానింగ్ శాఖ… ఇంత చిన్న ఘటనపై ఒకరి ఫిర్యాదుతోనే వెంటనే స్పందించి గోడను కూల్చివేయడంపై స్థానికులు మండి పడుతున్నారు. ఆలయ ప్రహరీ వ్యవహారంలో పూర్తి విచారణ చేపట్టి ఈ విషయమై న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు.

నాందేవాడలోని ఆలయ ప్రహరీ వ్యవహారంలో స్పందించిన టౌన్ ప్లానింగ్ శాఖ అన్ని వ్యవహారాలలోనూ కూడా ఇదే విధంగా స్పందించి కబ్జా దారులపై కొరడా ఝులిపించాల్సిన టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులు… నగరంలోని కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ టౌన్ ప్లానింగ్ శాఖపై దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement