Friday, November 22, 2024

ఆచల చిట్ ఫండ్ యజమాని అరెస్ట్, రిమాండ్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఆచల చిట్ ఫండ్ ఛైర్మెన్ పంచగిరి సత్యనారాయణను సుబేధారి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. హన్మకొండలోని నక్కలగుట్ట బ్రాంచ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆడెపు అన్నపూర్ణ పది లక్షల చిట్టి విభాగంలో మూడు చిట్టీలు వేసింది. చిట్టీల కాల పరిమితి ముగిసిపోయింది. తన మూడు చిట్టీల డబ్బులు ఇవ్వమని ఆడెపు అన్నపూర్ణ ఆచల చిట్ ఫండ్ నక్కలగుట్ట బ్రాంచ్ లో అడిగారు.

ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోగా చిట్టి వేసిన ఆడెపు అన్నపూర్ణను, ఆచల చిట్ ఫండ్ యజమాని పంచగిరి సత్యనారాయణ బెదిరింపులకు పాల్పడ్డాడు. చిట్టీల గడువు ముగిసి పోయిన తర్వాత మూడు చిట్టీల డబ్బులు ఇవ్వకపోగా, చిట్టీలు వేసిన అన్నపూర్ణను భయబ్రాంతులకు గురిచేయడంపై బాధితురాలు అన్నపూర్ణ సుబేధారి పోలీసులకు పిర్యాదు చేశారు. తగిన సాక్ష్యాధారాలను చూపడంతో పోలీసులు విచారణ జరిపి, చిట్ ఫండ్ యజమాని పంచగిరి సత్యనారాయణను అరెస్ట్ చేశారు. ఆయ‌న‌ను కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించడంతో, జైలుకు తరలించినట్లు సుబేధారి ఇన్ స్పెక్ట‌ర్ అల్లే రాఘవేందర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement