Sunday, January 5, 2025

Accident – రెండు వాహనాలు ఢీ – డ్రైవర్ కు తీవ్ర గాయాలు

గణపురం, జనవరి 3(ఆంధ్రప్రభ ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు -3 సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున పొగమంచు కమ్ముకోవడంతో ఆగి వున్న వాల్వో వాహనం గమనించక మరో వాహనం ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో గణపురం మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ అన్వర్ పాషా క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతడు బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్యాస్ కట్టర్ సహాయంతో డ్రైవర్ అన్వర్ పాషా ను బయటకు తీశారు.

క్షత్తగాత్రుడిని మొదట సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

.కాగా నిరుపేద కుటుంబానికి చెందిన అన్వర్ పాషా కు మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement