Saturday, January 4, 2025

Accident – వాహనాల పైకి దూసుకెళ్లిన లారీ – ఒకరి దుర్మరణం

హైదరాబాద్‌: ముషీరాబాద్ క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. జంక్షన్‌లో పార్కు చేసిన వాహనాల పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనంతో పాటు మరికొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ యూసఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement