గూడూరు (ప్రభ న్యూస్) జామాయిల్ కర్ర లోడుతో వస్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బోల్తా కొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ వైపు నుండి వస్తున్న లారీ నంబర్ టిఎస్ టి 0899 గల లారీ జామాయిల్ కర్ర వేసుకొని అతివేగంతో రావడంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారి ఇరువైపులా ఉన్న గుంచీల వద్ద బోల్తాపడడం జరిగింది.
దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని వచ్చినటువంటి ప్రయాణికులు ముగ్గురు లారీ కింద నలిగిపోయి మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతి చెందిన వారు గూడూరు మండలంలోని మచ్చర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చుంచ దేవేందర్ తో పాటు మట్టవాడ గ్రామ శివారు కొంగరగిద్ద గ్రామానికి చెందిన ధనసరి పాపారావు గూడూరు సిఐ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్నారు ఇరువురు తమ యొక్క విధుల నిర్వర్తించడం కోసం ప్రయాణానికి సిద్ధమయ్యారు.
దీంతో లారీ బోల్తా పడటంతో వారి మృత్యువాత చెందారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ నగేష్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.