Friday, January 10, 2025

Accident – లారీ – ట్రావెల్‌ బస్సు ఢీ: నలుగురు దుర్మరణం

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 17 మంది గాయాపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాకు చెందిని కూలీలు ఉపాధి కోసం ఒడిషా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద గల సూర్యాపేట-ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ట్రావెల్‌ బస్సు ఢీ కొట్టింది. దీంతో నలుగురు కూలీలు మృతి చెందగా మరో 17 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement