Monday, January 20, 2025

Accident – సంగుపేట బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లారీ – ఇద్దరికీ గాయాలు

జోగిపేట, జనవరి20 (ఆంధ్రప్రభ)నాందేడ్-ఆకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సోమవారం తెల్లవారుజామున బండల లోడ్ తో కర్నూల్ బేతం చెరువు నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్తున్న లారీ అందోల్ మండలం సంగుపేట వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఉన్న వంతెన పై నుంచి అదుపుతప్పి కింద పడింది. లారీకి సంబంధించిన టైర్లు మొత్తం బ్రిడ్జిపై ఉండిపోయాయి. లారీ నుజ్జునుజ్జు అయ్యింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లినర్ లకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇందులో లారీ డ్రైవర్ షకీర్ సుమారుగా 3 గంటల పాటు లారీ క్యాబిన్ ముందు భాగంలోని ఇరుక్కుని పెద్దగా అరుపులు పెట్టాడు. క్లీనర్ ధర్మేందర్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

- Advertisement -

విషయం తెలుకున్న జోగిపేట ఎస్ఐ పి. పాండు పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ షకీర్ ను హోమ్ గార్డు శ్రీశైలం బయటకు లాగి తన భుజంపై వేసుకొని తీసుకొచ్చి అంబులెన్స్ లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్, క్లీనర్లకు వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్య చికిత్సల కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం శివ మాలతో ఉన్నప్పటికీ డ్రైవర్ ను బయటకు తీయడంలో చేసిన సహయక చర్యలపై అక్కడున్న వారు హోమ్ గార్డును అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement