Sunday, December 1, 2024

Accident – మద్యం మత్తులో కారు డ్రైవింగ్ – దంపతులు దుర్మరణం

హైదరాబాద్:లంగర్‌హౌజ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మరణించారు . మద్యం మత్తులో డ్రైవర్ పవన్ స్విఫ్ట్‌కారు నడుపుతూ టూ వీలర్‌తో పాటు ఆటోను ఢీకొట్టాడు .ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి..

మృతులు మోనా,దినేష్ ఇద్దరిదీ ప్రేమ వివాహం. దినేష్ ఇటీవలే తన పుట్టినరోజు వేడుకల కోసం తన భార్యతో కలిసి లంగర్ హౌస్‌లోని అత్తారింటికి వచ్చాడు.లంగర్‌హౌస్‌ నుంచి బంజారాహిల్స్‌కు స్కూటీపై బయలుదేరారుఈ సమయంలోనే స్విఫ్ట్‌ కారు ఢీకొట్టింది. మృతులు బంజారాహీల్స్ నంది నగర్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఇద్దరు దంపతులు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. మృతురాలు మోనా గర్భవతి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. .

మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్విఫ్ట్‌ కారు ఢీకొట్టిన ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డవారు ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు.

కారు డ్రైవర్‌ పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement