హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎస్‌ఐ ప్రాథమిక కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సోమవారం సాయంత్రం 5 గంటలకల్లా తెలియజేయాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు వేర్వేరుగా వెబ్‌సైట్‌లో సూచించిన విధానంలోని టెంప్లేట్స్ ఫార్మెట్‌లో ఆన్‌లైన్‌లోనే పంపాలని సూచించారు. తమ అభ్యంతరానని ధ్రువీకరించేందుకు సరైన పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను పీడీఎఫ్ లేదా జేపీఈజీ ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ఈనెల 7న 554 ఎస్సై పోస్టులకు గాను జరిగిన రాత పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,25,759 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు బోర్డు మార్కులను ఈమేరకు కలుపనుంది.