Friday, November 22, 2024

TS: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు అమోదించండి..గ‌వ‌ర్న‌ర్ కు జీవ‌న్ విన‌తి …

టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కమిషన్ సభ్యులు, చైర్మన్ వారంతట వారే రాజీనామా చేశార‌ని, రాష్ట్ర గవర్నర్ ఈ విషయంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో జాబ్ భ‌ర్తీ నోటిఫికేషన్ల ఇవ్వాలంటే క‌మిషన్ ఉండాలని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించకపోతే నోటిఫికేషన్ల భర్తీకి వెళ్లలేమని స్పష్టంచేశారు. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలంటే టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను భర్తీ చేయాలన్నారు. రాజీనామాల నిర్ణయం జాప్యం అవ్వడం వల్ల నిరుద్యోగ యువతలో ఆందోళన కలుగుతుందని తెలిపారు. మరో నెలలో లోక్ సభ ఎన్నికల హడాహుడి ప్రారంభ‌మై మార్చి, ఏప్రిల్ వరకు కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడ‌ద‌ల అయితే నోటిపికేష‌న్ ఇచ్చే అవ‌కాశాలు ఉండ‌వ‌న్నారు.. ఎన్నిక‌ల కోడ్ తో నిరుద్యోగులు మే వ‌ర‌కూ నోటిఫికేష‌న్స్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంద‌న్నారు.. ఎన్నిక‌ల కోడ్ ను దృష్టిలో ఉంచుకుని రాజీనామాల‌ను వెంట‌నే ఆమోదించి కొత్త క‌మిటీ ఏర్పాటుకు మార్గం సుగ‌మం చేయాల‌ని ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ కు విజ్ఞ‌ప్తి చేశారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే టీఎస్పీఎస్సీ మెంబర్స్ ఫిలప్ కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement