Wednesday, November 6, 2024

TS: ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ..

చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 22వ తేదీన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరరావును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఏసీబీ కోర్టు విచారించింది.

నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం 3రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ‌ ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును గతవారం అదుపులోకి తీసుకున్న అధికారులు.. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement