Thursday, November 21, 2024

TS : ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

సిరిసిల్ల, మే 20 (ప్రభన్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

- Advertisement -

జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు నాలుగున్నర లక్షలతో నిర్మించిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ, చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీనితో వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించినట్టు ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు.

అనంతరం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల వేయడంతో సోమవారం రూ. 7 వేలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావు ను పట్టుకున్నారు. భాస్కర్ రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు డీఎస్పి తెలిపారు. అవినీతి అధికారులతో పీడించబడుతున్న బాధితులు ఏసీబీ డీఎస్పీ 9154388954, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 9154388955, 9154388956 నెంబర్లను సంప్రదించాలని ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement