హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఆగడాలను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ జులై 5న తెలంగాణలో పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని చెప్పి, విద్యా సంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదని రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు.
కార్పొరేట్ ఫీజుల దోపిడీ నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించినా, ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.