వాతావరణ పునరుద్ధరణ పరంగా తమ నిబద్ధతకు మరింత కట్టుబడి, ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవెర్, ఏబీ ఇన్బెవ్ ఇప్పుడు భారతదేశంలో తమ నాల్గవ బ్రూవెరీని పునరుత్పాదక విద్యుత్ దిశగా మళ్లించింది. ఈ బ్రూవెరీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక వనరులను వినియోగించుకుంటుంది. తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి వద్ద నున్న చార్మినార్ బ్రూవెరీ వద్ద పునరుత్పాదక విద్యుత్ స్వీకరణ చేయడం ద్వారా ఏబీ ఇన్బెవ్ అంతర్జాతీయ నిబద్ధత దిశగా మరో ముందడుగు వేసింది. 2025 సంవత్సరం నాటికి కంపెనీ విద్యుత్ కొనుగోళ్లు 100శాతం పునరుత్పాదకం చేయాలన్నది కంపెనీ లక్ష్యం.
ఈసందర్భంగా ఏబీ ఇన్బెవ్, ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రొక్యూర్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ హెడ్ అశ్విన్ కక్ మాట్లాడుతూ… పర్యావరణంతో పాటుగా మొత్తంమ్మీద సానుకూల మార్పులను తీసుకువచ్చేందుకు తమ కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడానికి, మెరుగైన భవిష్యత్‌ను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. తమ నాలుగవ బ్రూవరీలో సౌర విద్యుత్ స్వీకరణ అనేది 2025 నాటికి పునరుత్పాదక విద్యుత్‌ను అన్ని బ్రూవరీల వద్ద100శాతం సాధించాలనే తమ అంతర్జాతీయ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. దేశంలో మరిన్ని బ్రూవెరీల వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. భారతదేశపు యుఎన్ ఎస్‌డీజీ లక్ష్యాలకు మద్దతునందించనున్నామని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..