Saturday, January 18, 2025

ADB Crime | అప్పు తీర్చమని అడిగినందుకు యువతిపై బ్లేడుతో దాడి.

నిర్మల్ టౌన్, (ఆంధ్రప్రభ) : ఇచ్చిన అప్పు తీర్చాలి అడిగినందుకు యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.

జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ కాలనీలో దివ్య అనే యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. అదే కాలనీకి చెందిన సంతోష్ అనే యువకుడి కుటుంబానికి ఆమె సుమారు రూ.20 లక్షల రుణం ఇచ్చింది. అయితే అప్పు తిరిగి ఇచ్చే విషయంలో.. రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

గురువారం దివ్య తల్లిపై సంతోష్ దాడి చేశాడు. ఆమె తలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం దివ్య ఆస్పత్రి నుంచి సోఫీనగర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుప‌డిన‌ సంతోష్‌.. సర్జికల్‌ బ్లేడ్‌తో దివ్యపై దాడి చేశాడు.

దీంతో దివ్య మెడపై గాయాలయ్యాయి. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement