అల్వాల్ : అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్ లో పాత గొడవల నేపథ్యంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి ప్రాణాలను బలిగొన్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సందీప్ సెంథిల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
గత రాత్రి సమయంలో సెంథిల్ ఇంట్లోకి చొరబడిన అతని స్నేహితులు కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సెంథిల్ ను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు తెలిపారు. సెంథిల్ తో పాటు అతని స్నేహితులు మద్యానికి బానిసలైనట్లు, వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
- Advertisement -