కమ్మర్ పల్లి, జూన్ 7(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మోర్తాడ్, కమ్మర్ పల్లి ప్రాంతంలో రైలు కిందపడి మోర్తాడ్ గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయ 6 గంటల ప్రాంతంలో గూడ్స్ ట్రెయిన్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
మృతుడు మోర్తాడ్ గ్రామానికి చెందిన పల్ద సంతోష్ (20)గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేవని చెప్పారు. మృతుని అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
- Advertisement -