సిద్దిపేట : రోడ్డుప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని హుస్నాబాద్ మండలం గుగ్గిళ్ళ గ్రామం వద్ద హైదరాబాద్ హైవే పై బెజ్జంకి క్రాస్ కు కూతవేటు దూరంలో అతివేగంతో కారు వెళ్తుండగా, అటు వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది.
దీంతో సమాచారం అందుకున్న కోహెడ పోలీసులు హుటాహుటిన చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒక మహిళ మృతిచెందినట్లు కోహెడ ఎస్సై తిరుపతి తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -