నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది ఓ కారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ లక్ష్మమ్మ(40) పై నుంచి పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. అటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -