ఓ కిరాణం దుకాణం వ్యాపారి మూడు కోట్లకు టోకరా వేసి పరారైన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలో కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం యజమాని పరారీ అయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని 1వ టౌన్ పరిధిలోని కుమార్ గల్లిలో కిరాణా షాప్ నిర్వహించే యజమాని కనిపించకుండాపోయాడని, అతనికి సరుకులు, డబ్బులు, చిట్టిలు వేసిన బాధితులు బోదిబోమంటున్నారు. వారం రోజులుగా ప్రసాద్ కనిపించకుండా పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాశీ యాత్ర వెళ్తున్నానని ఇప్పటి వరకు అడ్రస్ లేడని వారు వాపోతున్నారు. నోటిమాటగా, సరుకులు వాయిదాల చెల్లింపుల నమ్మకంతో డబ్బులు ఇచ్చిన వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. గడిచిన కొన్ని రోజుల క్రితం అతని భార్య చనిపోవడంతో వ్యాపారంలో నష్టపోకూడదని డబ్బులు ఇచ్చామని మరికొందరు వాపోతున్నారు. ప్రసాద్ పరారీ విషయం తెలిసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదుపై తర్జనభర్జనలు పడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement