Thursday, December 26, 2024

IRCTC | రైల్వే యాప్ కు సాంకేతిక లోపం సేవలకు తీవ్ర అంతరాయం..

హైదరాబాద్ : రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మెయింటెనెన్స్‌ కారణంగా సర్వర్‌ డౌన్‌ అయ్యింది. ఫలితంగా గురువారం ఉదయం కొన్ని గంటల పాటు ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోయాయి.

ఉదయం తత్కాల్ టికెట్స్‌ బుకింగ్‌ సమయంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ అవ్వట్లేదని పలువురు యూజర్లు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేక పోతున్నామంటూ పేర్కొంటున్నారు. ఈ సమస్యపై ఐఆర్‌సీటీసీ స్పందించింది.

మెయింటెనెన్స్ కారణంగా ఈటికెట్‌ సేవలు అందుబాటులో లేవని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్‌ రద్దు చేసుకోవడానికి, ఫైల్‌ టీడీఆర్‌ కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 14646, 08044647999, 08035734999కు ఫోన్‌ చేయాలని, లేదంటే [email protected]కి మెయిల్‌ చేయాలని సూచించింది.

- Advertisement -

కాగా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండో సారి. రెండు వారాల క్రితం కూడా ఇదే సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా తత్కాల్‌ బుకింగ్‌ సమయంలోనే సమస్య తలెత్తింది. తరచూ ఇలాంటి సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహకానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement