Sunday, November 17, 2024

NZB: సనాతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి… ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రభ న్యూస్): సనాతన ధర్మ స్థాపన కోసం సనాతన బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై పూర్తి విచారణ చేపట్టి వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని ఐక్యతను దెబ్బ తీసే కుట్ర జరుగుతొందన్నారు. లడ్డు వివాదంపై కేంద్రం కూడా సీరి యస్ గా నే ఉందన్నారు. తిరుమలలోలడ్డు మాత్రమే కాదు భక్తులు అనేక ఇబ్బం దులు గురవుతున్నారని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే …
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే ననికష్టపడి పనిచేస్తే వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీఆర్ఎస్ ను ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. హైడ్రా కూల్చివేతలు సెలెక్టివ్ కాకుండా సెక్యులర్ గా ఉండాలన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి బేధాలు చూడొద్దన్నారు. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలన్నారు. వరికోతలు మొదలుకాక ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

డీఎస్ ప్రజలమనిషి… ధర్మపురి శ్రీనివాస్ కు ఘన నివాళి…
ప్రతిరోజు ప్రజల కోసం పరితపించి తన రాజకీయ జీవి తాన్ని అంకితం చేసి… ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజల మనిషి ధర్మపురి శ్రీనివాస్ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ధర్మపురి శ్రీనివాస్ జయంతి సందర్భంగా శుక్రవారం నగ రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద గల డి.శ్రీనివాస్ ఘాట్ వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… ధర్మపురి శ్రీనివాస్ తన కు రాజకీయ గురువు అని తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాల గతీతంగా ప్రజా సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు. ప్రజాసేవే ధ్యేయంగా ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్య, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement