వికారాబాద్, డిసెంబర్ 8 ( ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసుల సమస్య గురించి వివరించారు. ఆదివారం ఆయన నివాసంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా స్పీకర్ సానుకూలంగా స్పందించి.. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.