Saturday, November 23, 2024

TG | ఆస్ప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీపై నివేదిక ఇవ్వాలి.. దామోదర రాజనర్సింహ

  • ఆస్ప‌త్రుల తనిఖీల కోసం పది బృందాలు
  • మంత్రి దామోదర ఆదేశాలు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఆసుపత్రుల్లో తనిఖీల కోసం పది బృందాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పై మంత్రి దామోదర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement