- భయాందోళనలో ప్రజలు
- రసాయనాలు ఉబికి పైకి వచ్చాయని అనుమానం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఉన్న సుభాష్ నగర్ లో రోడ్డు ఒక్కసారిగా ఎర్రగా మారడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సుభాష్ నగర్ లోని చివరి బస్టాప్ రోడ్డులో సోమవారం రాత్రి ఒక్కసారిగా భూగర్భ డ్రైనేజీ నుంచి ఎరుపురంగు రోడ్డుపైకి వచ్చింది. రాత్రి వేళ రక్తం రంగులో కనిపించడంతో హత్యలు ఏమైనా జరిగియా అని భయపడుతూ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
రసాయనాలు ఉబికి పైకి వచ్చాయని అనుమానం..
జీడిమెట్ల సమీపాన ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలు నాళాలోకి పంపించడం వల్ల ఒక్కసారిగా ఉబికి పైకి వచ్చాయని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దుర్వాసన అధికంగా రావడంతో రసాయన వ్యర్థాలుగా వారు భావించారు.
అధికారులకు ఫిర్యాదు చేసినా…
ఈ విషయమై పీసీబీ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని అనుమతులు లేకుండా కాలనీలో ఇళ్లమధ్యలో నడుస్తున్న పరిశ్రమలను మూసివేయించాలని డిమాండ్ చేస్తున్నారు.