మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 600 గ్రాముల డ్రగ్స్ తో ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని.. నిందితుడిని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడొద్దని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాదు.. డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దీనికి డీజీ స్థాయి అధికారులను నియమించింది. పెద్ద ఎత్తున నిధులతో పాటు సిబ్బందిని కేటాయించింది.