Saturday, November 23, 2024

Cyber Crime | వర్క్‌ఫ్రం హోమ్.. బీటెక్‌ విద్యార్థినికి లింక్‌, రూ.91 వేల మోసం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్‌ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2వ తేదీన‌ నిజాంపేటకు చెందిన ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థినికి వర్క్‌ ఫ్రం హోం పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌కు సైబర్‌ నేరగాళ్లు లింక్‌ పంపించారు. దాన్ని ఆమె వాట్సాప్‌ ద్వారా షేర్‌ చేసింది. టాస్క్‌ల పూర్తి పేరుతో యువతి ఖాతా నుంచి రూ.91 వేలు కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలని మెసేజ్‌ పెట్టారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి 1930కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటుగాళ్లను గుర్తించే ప‌నిలోప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement