Friday, October 25, 2024

TG | మేకల కాపరిని వెంటాడిన చిరుత

చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న కాప‌రి
రెండు మేక‌ల‌పై దాడి


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లాలో శుక్రవారం మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సారంగాపూర్ మండలం రవీంద్ర నగర్ తండా స‌మీపాన‌ సహ్యాద్రి కొండల వద్ద తెల్ల‌వారు జామున మేక‌ల కాప‌రి సాయిని వెంబ‌డించింది. ఆ కాప‌రి సాయి చెట్టు పైకి ఎక్కి కేకలు వేశాడు. అక్కడికి గ్రామస్తులు వచ్చేలోపు రెండు మేకలను తిన్న చిరుత పులి వారిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు…
చిరుత‌ పులి సంచారంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గుర‌య్యారు. మేక‌ల మేత‌కు సహ్యాద్రి కొండల స‌మీపాన‌కు తీసుకు వెళుతుంటారు. అయితే చిరుత‌పులి సంచారంతో అటువైపు వెళ్ల‌డానికి వారు భ‌య‌పడుతున్నారు.

- Advertisement -

అట‌వీ ప్రాంత గ్రామాల్లో అవగాహన సదస్సు…
గత రెండు రోజులుగా బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌తంగా ఉండాల‌ని సారంగాపూర్ సెక్ష‌న్ ప‌రిధిలోని ఇప్పచెల్మ, పెండల్దరి ప్ర‌జ‌ల‌కు అట‌వీశాఖ అధికారులు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్ర్రత్తలు వివ‌రించారు. అలాగే వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాల్సిందిగా కోరారు. ఎలాంటి హాని తలపెట్టొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు రామకృష్ణ (నిర్మల్), వేణుగోపాల్ (టాస్క్ ఫోర్స్), ఎండీ. నజీర్ ఖాన్, సారంగాపూర్ డీఆర్ ఓ సంతోష్‌, ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ ఫాజిల్ హుస్పేన్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement