Monday, December 23, 2024

MBNR | అంతరాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్..

వనపర్తి ప్రతినిధి, (ఆంధ్ర ప్రభ): అంతర్రాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు మల్టీజోన్- II ఐజి.సత్యనారాయణ తెలిపారు. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హైవే -44 దారి దోపిడీ సంఘటనను సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా పోలీసులు 2రోజుల్లో కేసును ఛేదించి శభాష్ అనిపించుకున్నారు.

ఈ నెల 13న 8మంది కుటుంబ సభ్యులు కారులో తీర్థ యాత్రలు ముగించుకొని 18న ఉదయం 2:00లకు పెబ్బేరు శివారులో వాహనం నిలిపి నిద్రపోయారని,కొంతమంది గుర్తు తెలియని దుండగులు వచ్చి కారు, అందులో ఉండే మనుషులపై రాళ్లతో దాడి చేశారని వెల్లడించారు.

మహిళల మెడలో బంగారు నగలు లాక్కొని పారిపోతుంటే అడ్డుపడగా, వారిపై దాడి చేసి పారిపోయారని పేర్కొన్నారు. నేరస్తులను పట్టుకోవడానికి ఎస్పీ. గిరిధర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగ నేరం ఒప్పుకున్నట్లు ఐజీ వెల్లడించారు.

- Advertisement -

పథకం ప్రకారం దారీ దోపిడీ…

మహారాష్ట్రకు చెందిన ఆరుగురు నేరస్తులు ముందే వేసుకున్న పథకం ప్రకారం దారీ దోపిడీ చేశారు. బద్రి గజానన్, పిరోజే ఇద్దరు చేరుకు ట్రాక్టర్లను పెబ్బేరు జాతీయ రహదారిపై నిలిపారు.మిగిలిన నలుగురు బైక్ లపై వచ్చి ఆగి ఉన్న కార్లను చూశారు. కారులో అందరూ పడుకున్న విషయం తెలిసి లగేజ్ బ్యాగ్ లను చెక్ చేశారు.

అందులో ఏమి లేకపోవడంతో కారు వద్దకు వచ్చి మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోపిడీ చేయాలని రాళ్లతో దాడి చేశారు. అనంతరం మెడలో ఉన్న బంగారం లాక్కొని పారిపోతుండగా, అడ్డుపడిన వారిని రాళ్లతో దాడి చేసి అక్కడి నుండి నిందితులు పారిపోయారు.కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నేరస్తులను రెండు రోజుల్లో పట్టుకున్నారు.

నిందితుల నుంచి 2 20గ్రాముల పుస్తెల తాడు, బంగారు చైన్, నల్ల పూసల దండ, 3 ఫోన్ లు, 2 బైకులు స్వాధీన పర్చుకున్నారు.మొత్తం విలువ రూ. 7లక్షల దాక ఉంటుందని పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారు.

వారిని కూడా పట్టుకోవడానికి పోలీసుల ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఐజీ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పెబ్బేరు ఎస్సై , హరి ప్రసాద్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి, కానిస్టేబుళ్లు, నరసింహ,భాస్కర్,నవీన్, గౌస్ పోలీసు సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో ఐజి ప్రత్యేకంగా అబినధించారు.

ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు. కొత్తకోట సీఐ.రాంబాబు , వనపర్తి సీఐ. కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్.నరేష్, పెబ్బేరు ఎస్సై.హరిప్రసాద్ రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై.రామకృష్ణ ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement