Saturday, November 30, 2024

TG | బైక్ చోరీల‌కు పాల్ప‌డే ముఠా ప‌ట్టివేత‌

  • ఎనిమిది మంది అరెస్టు
  • 27బైక్‌ల స్వాధీనం
  • నిందితులంతా ఏపీకి చెందిన‌వారు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సూర్యాపేట : జిల్లాలో పార్క్ చేసి ఉంచిన బైక్‌ల‌ను చోరీకి పాల్ప‌డుతున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు ప‌ట్టుకున్నారు. ఏపీకి చెందిన ఎనిమిది మంది స‌భ్యులు ప‌లు ప్రాంతాల్లో పార్క్ చేసిన విలువైన బైక్‌ల‌ను దొంగ‌త‌నం చేస్తున్నారు. వారి నుంచి సుమారు 27బైక్‌లు స్వాధీనం చేసుకున్నామ‌ని ఎస్‌పీ స‌న్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు.

రూ.25.10 ల‌క్ష‌ల విలువైన బైక్‌ల స్వాధీనం..
బైక్‌ల చోరీ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న 27బైకుల విలువ సుమారు రూ.25.10 ల‌క్ష‌లు ఉంటుంద‌ని ఎస్‌పీ స‌న్ ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి ఆరు రాయల్ ఎన్‌ఫీల్డ్ లు, ఏడు యూనికర్న్ లు, ప‌ది పల్సర్లు, 2 హెచ్ఎఫ్‌ డీలక్స్, ఒక‌టి షైన్, ఒక‌టి హోండా పాషన్ ఉన్నాయ‌ని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement