Sunday, September 15, 2024

TG: నిండు కుండ‌లా మూసీ.. ఇన్‌ప్లో 843.97 క్యూసెక్కులు

అవుట్‌ఫ్లో 404 క్యూసెక్కులు
643.03 అడుగుల‌కు చేరిన నీటి మ‌ట్టం
రాత్రికి గేట్లు ఎత్తి నీరు విడుద‌ల చేసే అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సూర్యాపేట : మూసీన‌దికి భారీగా వ‌ర‌ద వ‌చ్చి చేరుతోంది. నిండుకుండ‌లా క‌నిపిస్తోంది. అయితే మ‌రో అడుగు నీరు చేరితే గేట్లు ఎత్తి కింద‌కు విడిచిపెట్టే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. మూసీ న‌ది దిగువ ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రాజెక్టు ఎస్ఈ శివ‌ధ‌ర్మ‌తేజ కోరారు. న‌దిలోకి ఎవ‌రూ దిగొద్ద‌ని హెచ్చ‌రించారు. మూసీన‌ది ప‌రివాహ‌క ప్రాంతంలో భారీ వ‌ర్సాలు కార‌ణంగా న‌దిలోకి వ‌ర‌ద నీరు భారీగా చేరుతోంద‌ని అధికారులు తెలిపారు.

న‌దిలోకి చేరుతున్న 843.97 క్యూసెక్కుల నీరు…
మూసీ న‌దిలో 843.97 క్యూసెక్కుల నీరు చేరుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శివ‌ధ‌ర్మ‌తేజ చెప్పారు. ప్రాజెక్టు పూర్తి నీటి మ‌ట్టం 645 అడుగులు కాగా, ప్ర‌స్తుతం 643.03 అడుగుల‌కు చేరుకుంది. ఇన్‌ఫ్లో పెరిగే అవ‌కాశం ఉన్నందున ఏ క్ష‌ణంలోనైన గేట్లు ఎత్తి కింద‌కు నీరు విడిచిపెట్టే అవ‌కాశం ఉంది. ఎడ‌మ కాలువ ద్వారా 238.05 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 166.63 క్యూసెక్కులు, పంప్ హౌస్‌కు 11.15 క్యూసెక్కులు, 49.07 క్యూసెక్కులు ఆవిరి అయిపోగా మొత్తం అవుట్‌ఫ్లో 464.9 క్యూసెక్కులు నీరుగా రికార్డు అవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement