తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే చిన్నారులను ఎత్తుకెళ్లే ముఠాకు తన కన్న కొడుకును అమ్ముకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో తండ్రిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అతడు ఇచ్చిన సమాచారంతో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిన్నారులను కొనుగోళ్లు చేసే ముఠా ఈ పని చేస్తుందా లేక పిల్లలు లేని వారు పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. విచారణ జరుగుతుందని వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ సంఘటనను ధృవీకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement