Friday, November 22, 2024

పెంపుడు శునకానికి దశ దిన కర్మ … చికెన్ తో సహా పంక్తి భోజనాలు

కేసముద్రం, జులై 15(ప్రభాన్యూస్ ): పెంచుకున్న కుక్కకు (జాకీ) సమాధి ఏర్పాటుచేసి, దశ దిన కర్మ చేయడంతో పాటు వాడ ప్రజలకు చికెన్ తో సహా పంక్తి భోజనాలు పెట్టి యజమాని రాచర్ల వీరన్న దంపతులు దానిపై తమకున్న అనురాగాన్ని చాటుకున్నారు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న, మంజుల దంపతులు ఆరు యేండ్ల క్రితం ఓ కుక్కను తెచ్చుకుని తమ పిల్లలతో పాటు ప్రేమతో పెంచుకున్నారు. ఈనేపథ్యంలో 10 రోజుల క్రితం జాకీ (కుక్క) అనారోగ్యంతో మృతి చెందింది. మనుషులకు చేస్తున్న దశ దిన కర్మ లాగానే తమ జ్ఞాపకాలను పంచుకునేందుకు యజమాని అయిన రాచర్ల వీరన్న, మంజుల దంపతులు జాకీ జ్ఞపకార్థంగా ఇంటికి దగ్గరలోని కుంటకట్ట వద్ద ఖననం చేసి సమాధి నిర్మించి జాకీ (కుక్క) ఫోటో ఏర్పాటు చేశారు.

పదవ రోజు న జాకీ (కుక్క)కి సమాధివద్ద గంగి రెద్దులతో దశదిన కర్మ చేశారు. ఈసందర్బంగా వాడ ప్రజలను పిలిచి చికెన్ తో సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులకు, తోటి మనుషులకు ఏదైనా ఆపద వస్తే ఆదుకొని నేటి ఈ సమాజంలో యజమాని రాచర్ల వీరన్న తాము పెంచుకున్న జాకీ (కుక్క ) మృతి చెందగా,జ్ఞాపకంగా సమాధి ఏర్పాటు చేసి దశదిన కర్మ చేసి సహా పంక్తి భోజనాలు పెట్టడం పట్ల గ్రామస్తులు హర్హం వ్యక్తం చేశారు.. దంపతులను మనసారా అభినందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement