Wednesday, November 20, 2024

TG | చరిత్రలో నిలిచిపోయేదే సమగ్ర కుటుంబ సర్వే.. దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు

శంకర్ పల్లి, నవంబర్ 5 (ఆంధ్రప్రభ) : చ‌రిత్ర‌లో నిలిచిపోయేదే స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే అని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో పోచమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు… చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) కార్యక్రమం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఈ సర్వే చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తెగలు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఈ సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 5384 ఎన్యూమరేషన్ బ్లాక్ లుగా విభజించడం జరిగిందని, ఒక బ్లాక్ లో 150 నుండి 175 గృహాలు ఉంటాయని ఎన్యూమరేటర్ గా వెళ్లే వారు ప్రతి కుటుంబం వద్ద 30 నుంచి 40 నిమిషాలు సమయం కేటాయించి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో త‌మ నాయకుడు రాహుల్ గాంధీ సూచనల మేరకు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పూర్తి సమాచారం కోసం ఏర్పాటు చేసిన ఈ సర్వే ను ప్రతి కుటుంబ యజమాని పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఈ సర్వే వల్ల ఎవరి రేషన్ కార్డు తొలగించబడదని, ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగదని ఆయన హామీ ఇచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ… సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, సీపీఓ సౌమ్య, డీపీఓ సురేష్ మోహన్, ఆర్డీవో చంద్రకల, డీపీఆర్ఓ వెంకటేశ్వరరావు, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్లు చంద్రమౌళి, శ్రీనాథ్, వాణి, ప్రకాష్ గుప్తా, రాములు, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, త‌హ‌సీల్దార్ సురేందర్, డివిజన్ అండ్ జిల్లాస్థాయి అధికారులతో పూర్తి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement