మంచిర్యాల, ఏప్రిల్ 19 (ప్రభన్యూస్): మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల ఆర్డీవో, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వి.రాములు శుక్రవారం తెలిపారు. ఈ నెల 17వ తేదీన పాత మంచిర్యాలలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధి కోసం రూ.1 లక్ష విరాళం అందించారని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి విరాళం అందించి కోడ్ ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement