Wednesday, October 2, 2024

TG: బాలికపై లైంగిక దాడి… వృద్ధుడిపై కేసు నమోదు

గీసుగొండ, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : గీసుగొండ మండలంలోని మనుగొండకు చెందిన ఓ బాలిక (12) ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు తల్లి ఉండగా, తండ్రి గతంలో మృతిచెందాడు. ఇంటి పక్కన ఉన్న 65ఏళ్ల వృద్ధుడి భార్య గతంలో చనిపోయింది. బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

అక్కడి వైద్యులు వరంగల్ లోని సీకేఎం ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. దీంతో సీకేఎం ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేసి నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు. ఈ విషయాన్ని వైద్యులు గీసుకొండ పోలీసులకు చేరవేశారు. విచారణ చేపట్టి వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఇన్ స్పెక్టర్ బాబూలాల్ తెలిపారు. వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement