Saturday, September 7, 2024

NZB: రూ.20లక్షలు స్వాహా… సీనియర్ బ్యాంక్ మేనేజర్ పై కేసు నమోదు…

నిజామాబాద్ ప్రతినిధి, జులై 17 (ప్రభ న్యూస్) : ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే.. రూ.20 లక్షల డబ్బులు స్వాహా చేసిన యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ ఖాతాదారుల వద్ద నుంచి అప్పులు చేసి పరారైన విషయం విధితమే. రూ.20 లక్షల డబ్బులు బ్యాంకు మేనేజర్ కాజేశారని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు పుల్లూరి రాకేష్ ఫిర్యా దు మేరకు సీనియర్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం… నిజామాబాద్ నగరానికి చెందిన కావేరి ట్రేడర్స్ యజమాని పుల్లూరి రాకేష్ శివాజీ నగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో వ్యాపార నిమిత్తం లోన్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సదరు వ్యాపారి సీసీ లోనుగా దరఖాస్తు చేసుకున్నాడు. లోను కోసం రూ.20 లక్షల రూపాయల ఖాతాదారుడి చెక్కులను బ్యాంకు మేనేజర్ నగదు రూపంలో మార్చుకొని కాజేశాడు. రూ.20 లక్షలు డబ్బులను స్వాహా చేశాడు.

ఖాతాదారుడు లోను విషయమై గతంలో బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా…. రేపు మాపు అన్నట్టు బుకాయించినట్లు సమాచారం. కాగా కొన్ని రోజులుగా సదరు సీనియర్ బ్యాంక్ మేనేజర్ పై వస్తున్న ఆరోపణలు, బ్యాంకు నుండి మేనేజర్ సస్పెండ్ కు గురైన విషయం తెలుసుకున్న బాధితుడు… వెంటనే నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సీనియర్ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీనియర్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement