వేములవాడ, ఆంధ్రప్రభ : కరీంనగర్ – కామారెడ్డి రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావు పేట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కరీంనగర్ ఎల్ ఎండీకి చెందిన పోలవేణి మంగ మృతిచెందగా, మాడిశెట్టి అశోక్, మాడిశెట్టి ఆద్య, పోలవేణి గట్టు బాబులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలికి బోయినపల్లి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్ పల్లి ఎస్సై పృధ్విరాజ్ తెలిపారు.
- Advertisement -