వరంగల్లో వీధికుక్కలు మరో బాలుడిని బలితీసుకున్నాయి. వరంగల్లోని కొత్తపల్లిలో 15 రోజుల క్రితం బాలుడిపై కుక్కలు దాడిచేశాయి. వెంటనే స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ 18నెలల బాలుడు రాజ్ ఇవ్వాల (బుధవారం) చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై చాలామంది తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. పిల్లల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ఇక.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ కుక్కల బెడద విపరీతంగా ఉంది. పలు చోట్ల మందలు మందలుగా కుక్కలు తిరుగుతూ బైకులమీద వెళ్లే వారిని, పాదచారులపై అటాక్ చేస్తున్న ఘటనలున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా వీధి కుక్కల బెడద ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంసీ ఇచ్చిన స్పెషల్ కాల్ సెంటర్కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పిల్లల ప్రాణాలు పోతుంటే అశ్రద్ధగా ఉండడం ప్రభుత్వానికి, అధికారులకు తగదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.