ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
గొల్ల బుద్దారం గ్రామానికి చెందిన నూనేటి వెంకన్న తన బైక్ పై వెళ్తుండగా… రోడ్డుపై ఉన్న ఉన్న ఎడ్ల బండిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.