కేంద్ర బడ్జెట్ పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ లో ఆమె నిర్మలా సీతారామన్ ను పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని ఆమె కోరారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారో సమాధానం చెప్పాలని కవిత ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. ఎల్ఐసీని అమ్ముతుంది దేశం కోసమా? ఎవరి కోసం? అని ప్రశ్నించారు. దేశం అంటే మట్టి కాదని, ఎల్ఐసీని అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమాధానం చెప్పాలని కవిత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..